ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైన ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ కారణంగా జల దిగ్బంధంలో చిక్కుకున్న కొప్పర్గ,హంగర్గ,సాలూర,ఖాజాపూర్ గ్రామాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. వరద తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలను బోట్ లు, ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో పునరావాస శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్,ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు