అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడుఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో శనివారం ఐదు గంటల పది నిమిషాలు సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన లక్ష్మీదేవిమ్మ అనంతపురం రూరల్ టిడిపి నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి తనకు రాష్ట్ర డైరెక్టర్ గా పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండి పనిచేసిన వారికి తగిన గుర్తింపు కచ్చితంగా వస్తుందని అందుకు నిదర్శనమే డైరెక్టర్లు చైర్మన్ గా పదవులు వచ్చాయని పరిటాల సునీత పేర్కొన్నారు.