ఎన్నికలు సమీపిస్తున్న వేళ నందిగామలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.... ఇందులో బాగంగా నియోజక వర్గంలోని టోల్ గేట్ ల వద్ద మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు.... అక్రమ మద్యం, నగదు తరలింపు అరికట్టే దిశగా తనిఖీలు ముమ్మరం చేశారు... సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతు వాహనాల్లో నగదు తరలిస్తే దానికి సంబందించిన పత్రాలు వుండాలని కోరారు... ఎన్నికల్లో కేసుల్లో పట్టుబడితే చర్యలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు