కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. ఆచంట నియోజకవర్గ పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆచంట నియోజక వర్గంలో గోస్తని డ్రైన్, నక్కల కాలువ వల్ల పంట పొలాలు ముంపుకు గురైన రైతులకు ఇంతవరకూ పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమని ఆయన అన్నారు.