నకిలీ ఎరువులు అంటగట్టారని రైతులు కలెక్టరేట్ ముందు ఎరువుల బస్తాతో నిరసన తెలిపిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువుల బస్తాలు కొనుగోలు చేయడంతో అవి నాసిరకంగా ఉన్నాయని రైతులు కలెక్టరేట్ వద్దకు వాటిని తీసుకొని వెళ్లి నిరసన తెలిపార. విషయం వ్యవసాయ శాఖ అధికారులకు తెలియడంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.