అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని పులగుట్టపల్లి పెద్ద తండా గ్రామంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన జ్యోతిబాయి పీజీటీ టీచర్, రాజేష్ నాయక్ ఎస్జీటీ టీచర్, సీనానాయక్ ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాజ్య గ్రామీణ బ్యాంకు లో క్లర్క్, రాఘవ నాయక్ ఓపెన్ కేటగిరీలో 147 మార్కులు సాధించి సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. 2025 లో ఇప్పటి వరకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు బుధవారం వారిని అభినందించారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.