పోలీసులు వేధింపులు తాళలేక చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కంబదూరుకు చెందిన ప్రకాష్ బుధవారం చెప్పారు. వివరాల్లోకి వెళ్తే గత మంగళవారం ఎస్సై లోకేష్ పోలీసు సిబ్బందితో కలిసి కర్ణాటక మద్యం ప్యాకెట్లు విక్రయిస్తున్నాడనే నెపంతో ప్రకాష్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రకాష్ పోలీస్ స్టేషన్లోని కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు గమనించి వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడు ప్రకాష్ మాట్లాడారు. పోలీసులు వేధించడం వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానన్నాడు. ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలన్నారు