దేశ స్వాతంత్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడి చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన సర్ధార్ భగత్ సింగ్ ఆశయాల సాధనకు సమిష్టిగా కృషిచేద్దామని ఐఓసి అంతర్జాతీయ అధ్యక్షులు మొహిందర్ సింగ్ గిల్ గిల్జైన్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పర్యటన సందర్బంగా శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో పట్టణంలోని సిక్కు కుటుంబాలతో సమావేశమయ్యారు,భగత్ సింగ్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సిక్కు కుటుంబాలను ఉద్దేశించి అయన మాట్లాడుతూ సుక్కు జాతికి భారత దేశమంటే ప్రాణమని, దేశంకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని పోరాట పటిమ ఉన్నవారన్నారు.