నవీపేట్ పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులుగా గంగా కిషన్ తోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గ సభ్యులను పద్మశాలి సంఘ సభ్యులు నాయకులు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.