సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. మొదటగా సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు బైపాస్ రోడ్డు వైపున నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను నిమజ్జనం చేసిన మరుసటి రోజున నీటిలో నుంచి తీయాలని లేనిచో చెరువులోని నీరు కలుషితమవుతాయని మరియు ఇతర విగ్రహాలను నిమజ్జనం చేయుటకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. నిమజ్జనం కొరకు వచ్చిన భక్తులు భగవంతుడి వద్ద పూజించిన పూలదండలు, పూజ సామాగ్రి, పండ్లు చెరువులో వేయకుండా పక్కన ఏర్పాటు చేసినటువంటి డబ్బాలో చేయాలని సూచించారు.