తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అందించిందని, శ్రీ శక్తి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని ఆయన తెలిపారు.