పుట్టపర్తి పట్టణంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా ఎండ వేడితో ఇబ్బందులు పడ్డ ప్రజలు బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొద్దిగా ఉపశమనం పొందారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా పుట్టపర్తి పట్టణంలోని పలు వార్డుల్లో వినాయక మండపాలు తెలిసాయి. కానీ సాయంత్రం అనుకోకుండా కురిసిన వర్షానికి వినాయక మండపాల వద్ద కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యాయి.