ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా గౌరవ డాక్టర్ సి.యామిని, చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప వారి సూచనల మేరకు గౌరవ ఎస్. బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కడప వారు 13-09-2025 వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ముందస్తు జాతీయ లోక్ అదాలత్ మీటింగ్ న్యాయ సేవా సదన్ కడప నందు పోలీస్ అధికారులకు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కువ కేసులు రాజీ అయ్యేవిధంగా కృషి చేయాలని కోరారు. పోలీసు స్టేషన్ల వారీగా కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.