అప్పన్నస్వామికిభక్తులు సమర్పించిన గోవులను అక్రమంగా తర లిస్తున్న వ్యక్తిని గోపాలపట్నం పోలీసులు అదు పులోకి తీసుకున్నారు. సింహాచలానికి చెందిన ఎర్ర శ్రీనివాసరావు మూడు గోవులు అదృశ్యమై నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోడవరం మండలం, కండే పల్లి గ్రామానికి చెందిన ఆడారి రామచంద్రనా యుడు(24)ను అదుపులోకి తీసుకుని విచారిం చగా నేరం అంగీకరించినట్టు గురువారం గోపాలపట్నం పిఎస్ పోలీసులు పబ్లిక్ ప్రతినిధికి తెలిపారు