ఎమ్మిగనూరు: గోనెగండ్లలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు..గోనెగండ్లలో మహా ప్రవక్త మహమ్మద్ సోల్లెల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. జామియా మసీద్ నుంచి ర్యాలీగా బయలుదేరి రోగులకు, వృద్ధులకు పాలు, పండ్లు, మిఠాయిలు పంచారు. అనంతరం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మిలాద్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.