రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన దుగ్గిలమ్మ అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండే అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ క్యూ కట్టారు. చిన్నారులు, మహిళలు సైతం ఇక్కడ వేపచీరలు ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆంద్ర కర్నాటక ప్రాంతాల నుండి సైతం వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.