వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ స్మశాన వాటిక లో కనీస మౌలిక వసతుల కోసం 17 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ “ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్మశాన వాటికలు కూడా ప్రజా జీవనంలో ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు, విద్యుత్, కూర్చునే సదుపాయం, షెడ్లు, టాయిలెట్లు వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం.