వినాయక నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఈ నెల 4వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్లు, కల్లు దుకాణాలు, మిలిటరీ క్యాంటీన్లు, TSBCL కరీంనగర్ డిపోలు మూసివేయాలని కరీంనగర్ జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి పి.శ్రీనివాస్ రావు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.