చంద్రశేఖరపురం: గుర్తుతెలియని వాహనం ఢీకొని 8 గేదెలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చంద్రశేఖరపురం మండలం కోవిలంపాడు జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోవిలంపాడు వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న ఎనిమిది గేదెలను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గేదెల మృతితో వాటి యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.