నెల్లూరు జిల్లా రాపూరు మండలం మాదేలమడుగు వ్యవసాయ మార్కెట్ గోదాం ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా నాల్గో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి విచ్చేశారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి ఆసరా లబ్దిదారులతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు. స్వయం సహాయక సంఘాల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.. అనంతరం పొదుపు మహిళలతో కరచలనం చేస్తూ వారితో ముచ్చటించారు