మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోనీ ఎస్బిఐ బ్యాంక్ లో మోసం వెలుగులోకి వచ్చిన విషయంలో శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా పోలీస్, బ్యాంక్ సిబ్బంది ఆడిట్ నిర్వహిస్తున్నామని, ఎస్బిఐ బ్యాంక్ సిబ్బంది బంగారం, నగదు చోరీ జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆడిట్ నిర్వహించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 80 లక్షల రూపాయల నగదు, బంగారం చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని, పోలీస్ తరుపున అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.