తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సిటీ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని పులాంగ్ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నుడా చైర్మన్ కేశ వేణు ఇతర నాయకులతో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం టపాకాయలు కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం BCలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందని సంతోషం వ్యక్తం చేశారు