హైదరాబాద్ లో మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణను కలిశారు. పాలకొల్లులో ఈనెల 24న జరిగే తన కుమార్తె శ్రీజ వివాహానికి రావాలంటూ నిమ్మల ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి వచ్చి కొత్త జంటను ఆశీర్వదించాలని బాలకృష్ణను కోరారు. వస్తానని ఎలా వస్తానో చెప్పనని బాలకృష్ణ తెలిపారని రామానాయుడు తెలిపారు. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనును కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.