నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ డైరీ ఫాం ప్రాంతంలో చెరువుల పడి వ్యక్తి మృతి చెందినట్లు శుక్రవారం ఆరవ టౌన్ ఎస్ఐ మహేష్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు నాందేడ్ జిల్లా దెంగ్లూర్ లోని శవాల గ్రామానికి చెందిన జింకల్ వార్ శంకర్ 40 గా పోలీసులు గుర్తించారు. అయితే శంకర్ గత కొన్ని సంవత్సరాలుగా ధర్మపురి హిల్స్ లో ఉంటూ కూలి పని చేస్తూ జీవనం సాగించేవాడు. కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులు పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమతిస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చరికి తరలించారు.