మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరం : మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరమని పోర్డ్ సంస్థ బాలల ఐక్యవేదిక నియోజకవర్గ కన్వినర్ నరసింహులు అన్నారు. పెద్దమండ్యం (M) కలిచర్ల జూనియర్ కళాశాలలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని చేశారు. పరిసర ప్రాంతాల్లో చిన్నారులు, మహిళలను ఎవరైనా అపహరించినా, కిడ్నాప్ చేస్తున్నారని అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రదర్శనల ద్వారా వివరించారు. ప్రిన్సిపాల్ రవీంద్ర, అధ్యాపకులు పాల్గొన్నారు.