అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో గల రోలుగుంట మండలం నిండుగొండ గ్రామంలో ఆదివారం ఉదయం 12 అడుగుల కొండ చిలువ హల్చల్ చేసింది. గ్రామంలోని మర్రిచెట్టు వద్ద ఒక నాటుకోడిని మింగుతూ గ్రామస్థుల కంట పడింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. నాటుకోడిని మింగడంతో కొండ చిలువ ఎటూ కదల్లేక పోయింది. అయితే కొందరు యువకులు కొండ చిలువను హతమార్చారు.