ఈ నెలల కాలంలో ముదిరాజులు, మత్స్యకారుల బతుకు అగమ్యగోచరంగా మారిందని అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపిన రేవంత్ రెడ్డి ఈనాడు ముదిరాజ్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు ఇవ్వకుండా ఎగ నామం పెడుతున్నాడని గత సంవత్సరంలో చేప పిల్లలకు ఎగనామం పెట్టి ఈ సంవత్సరం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నాడని మండి పడ్డారు, చేప పిల్లల టెండర్లలలో అధికారులు, హస్తం నాయకుల