ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరసింహులు కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. సమాచారాన్ని అందుకున్న స్థానిక ఎస్సై నాగరాజు సంఘటన స్థలం చేరుకొని జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలటిస్తామని ఎస్సై నాగరాజు తెలిపారు. పోస్టుమార్టం కొరకు నరసింహులు మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్ఐ అన్నారు.