ఆదివారం పరకాల మండలం మల్లక్క పేట గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అంతకముందు మల్లక్కపేట ఆర్చ్ నుండి ప్రభుత్వ పాఠశాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. వైద్య సిబ్బందిని శాలువాతో ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.