Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: అంగీకర్ ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించిన హౌసింగ్ జిల్లా అధికారి పిచ్చయ్య

Bhimavaram, West Godavari | Sep 19, 2025
"అంగీకార్- 2025" ప్రచార అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అంతట విస్తృతంగా నిర్వహించాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 లో భాగంగా అంగీకార్ ప్రచార కరపత్రాన్ని జిల్లా కలెక్టరేట్ హౌసింగ్ కార్యాలయం నందు హౌసింగ్ జిల్లా అధికారి జి.పిచ్చయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎంఏవై - అర్బన్ 2.0 పథకం ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా "పిఎంఏవై దివస్"ను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి సెప్టెంబర్ & అక్టోబర్ నెలలను "హౌసింగ్ నెలలుగా" జరుపుకుంటున్నాయని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us