రైతులకు వెంటనే యూరియాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో అన్నదాత బోరు కార్యక్రమంలో భాగంగా వైసీపీ శ్రేణులు, రైతులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం వద్ద నుంచి టీ సర్కిల్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చారు.