పేద విద్యార్థులు చదువును ఆయుధంగా మార్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ ఎన్.ఎం.ఎం.ఎస్ ఉచిత శిక్షణ శిబిరాన్ని భాష్యం ఆడిటోరియంలో ప్రారంభించారు. కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు గమ్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో అడుగులు వేస్తే గమ్యస్థానాన్ని చేరుకోగలరన్నారు.