చదువుకునే వయస్సులో చదువు మీద మాత్రమే ఏకాగ్రత కలిగి వుండాలని భీమవరం 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ యన్. జ్యోతి అన్నారు. ఇతర ఆకర్షణలకు లోనైతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరని, ఎన్నో వ్యయప్రయాసలతో తల్లిదండ్రులు చదివిస్తున్నారని, బాల్య వివాహాలు చేసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అన్నారు. ఈనెల 24 నుండి 30 వరకూ బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్నందున శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఆదిత్య జూనియర్ కాలేజీలో మేజిస్ట్రేట్ అధ్యక్షతన న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.