కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో బిఆర్ఎస్ కార్యకర్త పై దాడి చేశారని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం బిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ, ఇతర ముఖ్య నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.సతీష్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేపించి ఇంటి దగ్గర దించినట్లు తెలిపారు.మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సంబంధించి వార్త కవరేజ్ ను సోషల్ మీడియాలో పెడుతున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలే దాడి దాడి చేశారని ఆరోపించారు.