అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని రజాపురం గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఎల్లమ్మ అనే మహిళ ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని గుత్తి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లమ్మ అనే మహిళ ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి 14న గుత్తి ఆసుపత్రిలో మృతి చెందింది. ఆమె చేతిపై ముగ్గు ఆకారం ఉందని తలకు గుండు చేయించుకుందని తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.