తక్షణమే రైతులకు యూరియా అందించాలని వైస్ ఎంపిపి దొండా లలితా నారాయణమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా వడ్డాది రైతు సేవా కేంద్రం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయింది అన్నారు. అధికారుల హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయన్నారు. యూరియా కోసం వడ్డాది ఆర్ఎస్కే వద్దకు వస్తే సమాధానం చెప్పే వారే లేరన్నారు. యూరియా దొరకక వరి రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.