ఐదేళ్ల తర్వాత మొదటిసారి అత్తిలి రైల్వే స్టేషన్లో హాల్టు కల్పించడంతో కూటమి నేతలు బుధవారం రైలుకు స్వాగతం పలికారు. బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో కూటమి నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చొరవతో అత్తిలి రైల్వే స్టేషన్లో సర్కారు ఎక్స్ప్రెస్ ఆగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు.