వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ను కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను డిఎస్పి పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను స్థానిక ఎస్సై కృష్ణ పావనిని అడిగి తెలుసుకున్న డీఎస్పీ.... పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా రానున్న వినాయక చవితి వేడుకలను వెలిగండ్ల మండలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్సైను ఆదేశించారు. డీఎస్పీ వెంట పామూరు సిఐ భీమా నాయక్ ఉన్నారు.