Parvathipuram, Parvathipuram Manyam | Aug 26, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలోని మామిడిపల్లిలో ఆకస్మికంగా విజిలెన్స్ అధికారులు ఎరువుల షాపులలో మంగళవారం సాయంత్రం తనిఖీలు చేశారు. సాలూరు మండల వ్యవసాయ అధికారి శిరీష రాత్రి ఎనిమిది గంటలకు వివరాలు తెలిపారు. మామిడిపల్లిలోని శ్రీ పోలమాంబ రైతు డిపో, సూర్య గాయత్రి ఏజెన్సీలో ఎరువుల షాపులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. పొటాష్ అలాగే డిఎపి ఎరువులకు సంబంధించి, గోడౌన్లో ఉన్న నిల్వకు ఈపాస్ లో ఉన్న నిల్వకు తేడాలు ఉండడాన్ని గుర్తించారు. దీంతో దాదాపు నాలుగు లక్షల రూపాయల విలువచేసే ఎరువులను విక్రయించవద్దని విజిలెన్స్ సిఐ రవిప్రసాద్ ఆదేశించారు.