కృష్ణదేవిపేట నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో రంపులు ఘాట్ రోడ్డులోని చిన్న కాట్రగడ్డ సమీపంలో ఉన్న మలుపు వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. 516-ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన ఓ భారీ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొదళ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కేడీపేట ఆసుపత్రికి తరలించారు. అయితే గత రెండు వారాల్లో ఆ ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.