నిజామాబాద్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి, ప్రజలను అనారోగ్యాలతోటి కాపాడాలని డిమాండ్ చేస్తూ CPIML,మాస్ లైన్ ప్రజాపంథా నగర కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నగరంలోని మెజారిటీ డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి పారిశుధ్యం పడకేసిందన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ జరగడం లేదన్నారు. డెంగ్యూ, మలేరియా ఇలాంటి విష జ్వరాల కేసులు పెరుగుతున్నాయన్నారు. కుక్కలు, కోతుల సమస్య నగరవాసులను తరచూ ప్రమాదాలకు గురిచేస్తుందన్నారు. డ్రైనేజీ పైప్ లైన్, తాగునీటి పైప్ లైన్ లు లీకేజీలకు గురై తాగునీరు కలుషితమవుతుందన్నారు.