మహిళా ఏఈఓలపై అసభ్యకరంగా ప్రవర్తించిన తుంగతుర్తి ఏవో బాలకృష్ణ, నూతనకల్ ఏవో మురళిలపై శాఖా పరమైన చర్యలు తీసుకొని, తనకు రక్షణ కల్పించాలనీ ఏవో మహిత కోరారు. రాత్రి పది గంటల సమయంలో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతూ ఏవోలు బెదిరించినట్లు ఆమె పేర్కొంది. ఈ మేరకు హ్యూమన్ రైట్స్ ను ఏఈఓ మహిత ఆశ్రయించింది జరిగిన సంఘటనపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలనీ కోరారు.