ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పాటు పడుతుందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంలో CM రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాలభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.