పెద్దపంజాణి: పోలీస్ స్టేషన్ వర్గాలు బుధవారం తెలిపిన సమాచారం మేరకు. గడ్డురు గ్రామానికి చెందిన కృష్ణప్ప కుమారుడు కుమార్ 25, వ్యక్తిగత విషయాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారంతో ఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కొరకు తరలించామన్నారు. కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరి ఇంకేదైనా కోణం ఉందా అనే వివరాలు పోస్టుమార్టం అనంతరం పోలీసులు వెల్లడిస్తామన్నారు.