గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామంలో ఆంజనేయ, రామేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంజూరైన రూ 48 లక్షల పత్రాన్ని గ్రామ పెద్దలకు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మంగళవారం సాయంత్రం అందించారు. గ్రామ ప్రజల విన్నపం మేరకు చైర్మన్, ఎమ్మెల్యే దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. దీంతో గ్రామ ప్రజలు సీఎం చంద్రబాబు, కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ జే. సురేష్ పాల్గొన్నారు.