మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 29.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 24.5, అడ్డాకుల 23.5, కౌకుంట్ల 8.8, మహబూబ్నగర్ అర్బన్ 6.8, గండీడ్ మండలం సల్కర్ పేట 5.5, కోయిలకొండ 5.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 4.5, బాలానగర్ 3.8 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.