గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సీనియర్ న్యాయవాది, మాజీ ప్రభుత్వ సహాయ న్యాయవాది దారం సాంబశివరావు పిలుపునిచ్చారు. శుక్రవారం రేపల్లె న్యాయస్థానాల ప్రాంగణంలో రేపల్లె బార్ అసోసియేషన్ న్యాయవాదులతో కలిసి గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కారం దిశగా ఈ సదస్సులో చర్చించనున్నట్లుగా వివరించారు.