కూటమి ప్రభుత్వం దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తుందని వైసీపీ గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతిన మహేశ్ ధ్వజమెత్తారు. గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేసిందని చెప్పారు. యూరియా కొరత తీర్చాలని కోరుతూ ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. వైఎస్ వర్ధంతిని కూడా రాజకీయం చేశారు. జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.