నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలం, వల్లాల గ్రామంలో స్వాతంత్ర సమరయోధుల మారక స్తూపాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామెల్, బత్తుల లక్ష్మారెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.