ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ ఆటోవాలా మానవత్వం చాటుకున్నాడు. శుక్రవారం ఓ కుటుంబం రైలులో బొబ్బిలి నుంచి కందుకూరుకు వెళుతుంది. ఇంతలో వారి చిన్నారికి అకస్మాత్తుగా పిట్స్ వచ్చి ఆరోగ్యం విషమంగా మారింది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో దిగిన కుటుంబానికి ఆటోవాలా సహాయం అందించాడు. ఆలస్యం చేయకుండా వెంటనే ఆటోలు హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లాడు. ఆ కుటుంబ వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న ఆటో డ్రైవర్ వెంటనే హాస్పిటల్ ఓపికి నగదు అతనే చెల్లించాడు. వెంటనే చిన్నారికి వైద్యం చేయడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆటో డ్రైవర్ని పలువురు అభినందిస్తున్నారు.